పటౌడి హౌస్ లో తెలంగాణ భవన్ నిర్మాణానికి రేవంత్ ప్రభుత్వం ప్లాన్
- ఢిల్లీలోని పటౌడీ హౌస్ లో తెలంగాణ భవన్
- కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణం
- మార్చిలోగా నిర్ణయం తీసుకుంటామన్న కోమటిరెడ్డి
ఢిల్లీలోని పటౌడీ హౌస్ లో తెలంగాణ భవన్ ను నిర్మించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. పటౌడీ హౌస్ లో ఉన్న ఐదున్నర ఎకరాల ప్రాంతంలో ఈ భవనాన్ని నిర్మించాలని యోచిస్తోంది. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఈ భవనాన్ని నిర్మించాలని భావిస్తోంది. ఈ భవనంపై వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవనం యొక్క విస్తీర్ణం, ఎన్ని గదులు వుంటాయి? తదితర వివరాల గురించి ఆరా తీశారు.
మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ భవన్ పై మార్చిలోగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలను చేపట్టిన మల్లు రవి తెలంగాణ భవన్ నిర్మాణంపై పూర్తి దృష్టిని సారించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర హోంశాఖకు ప్రతిపాదనలు పంపిస్తామని.. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణ పనులను ప్రారంభిస్తామని మల్లు రవి తెలిపారు.