స్నేహితులతో కలిసి 'హనుమాన్' చిత్రాన్ని వీక్షించాను... అద్భుతంగా ఉంది: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- ఇటీవల విడుదలైన హనుమాన్ చిత్రం
- నేడు రామానాయుడు స్టూడియోస్ లో వీక్షించిన వెంకయ్యనాయుడు
- చిత్రబృందానికి అభినందనలు తెలుపుతూ ట్వీట్
ఇటీవల విడుదలైన హనుమాన్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తేజా సజ్జా ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ శర్మ తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీసు వద్ద కూడా సందడి చేస్తోంది. కాగా, హనుమాన్ చిత్రాన్ని తాజాగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీక్షించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
"హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో నేడు హనుమాన్ చిత్రాన్ని స్నేహితులతో కలిసి వీక్షించాను. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. భారతీయ ఇతిహాస వీరుల్లో ఒకరైన ఆంజనేయస్వామి స్ఫూర్తిగా రూపొందించిన ఈ చిత్రంలోని ప్రతి ఘట్టం ఆకట్టుకుంది. సినిమా నిర్మాణ విలువలు, గ్రాఫిక్స్ ఉన్నతంగా ఉన్నాయి. ఈ సినిమాలో తేజా సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, ఇతర నటుల నటన ఆకట్టుకుంది. నిర్మాత నిరంజన్ రెడ్డి గారికి, దర్శకుడు ప్రశాంత్ వర్మకు, ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు" అంటూ వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.