ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కేఏ పాల్... గ్లోబల్ పీస్ ఎకనమిక్ సదస్సుపై చర్చ

  • అక్టోబర్ 2న గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్‌ను నిర్వహించనున్న కె.ఎ.పాల్
  • తెలంగాణకు భారీ పెట్టుబడులు తెచ్చేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడి
  • హాజరు కావాలంటూ ఇన్వెస్టర్లను కోరుతూ సీఎంతో కలిసి వీడియో విడుదల
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో సీఎంను కలిసిన పాల్ తాను హైదరాబాద్‌లో నిర్వహించబోయే సదస్సు గురించి చర్చించారు. అనంతరం కె.ఎ. పాల్ మాట్లాడుతూ... అక్టోబర్ 2న గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి అందరూ హాజరు కావాలని కోరారు.

తెలంగాణకు భారీ పెట్టుబడులు తెచ్చేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ శాంతి, ఆర్థిక సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి ఆతిథ్యం ఇచ్చేందుకు అంగీకరించినట్లు చెప్పారు. ఈ సదస్సుకు హాజరు కావాలంటూ ఇన్వెస్టర్లను కోరుతూ సీఎంతో కలిసి వీడియోను విడుదల చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... కె.ఎ.పాల్ హైదరాబాద్‌లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని కోరారు.

గృహ నిర్మాణ శాఖపై సీఎం సమీక్ష

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


More Telugu News