అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 2 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు: పురందేశ్వరి
- విజయవాడలో బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశం
- ఎన్నికల్లో పోటీకి దరఖాస్తులు ఆహ్వానించామన్న పురందేశ్వరి
- పొత్తులపై అధిష్ఠానం నుంచి త్వరలోనే స్పష్టత వస్తుందని వివరణ
విజయవాడలో ఇవాళ బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,రాష్ట్రంలో బీజేపీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 2 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, ఒక్కో ఎంపీ స్థానానికి గరిష్ఠంగా 10 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారని పురందేశ్వరి వివరించారు. ఈ దరఖాస్తులను బీజేపీ ముఖ్యనేతలు గత రెండ్రోజులుగా పరిశీలించారని వెల్లడించారు.
ఏపీలో పొత్తులపై త్వరలోనే తమ హైకమాండ్ నుంచి స్పష్టత వస్తుందని భావిస్తున్నామని తెలిపారు. ఏపీలోనూ బీజేపీ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
కేంద్రంలో పదేళ్లుగా బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధిని అందరూ గమనిస్తున్నారని, రాష్ట్రంలో అలాంటి అభివృద్ధి జరగాలంటే బీజేపీతోనే సాధ్యం అని ప్రజలు నమ్ముతున్నారని ఆమె వివరించారు.