దిల్ రాజు చేతికి లక్ష్ చదలవాడ ‘ధీర’

  • లక్ష్ హీరోగా రూపొందిన 'ధీర'
  • కథానాయికలుగా నేహా పఠాన్ - సోనియా బన్సాల్ 
  • దర్శకుడిగా విక్రాంత్ శ్రీనివాస్ పరిచయం 
  • ఫిబ్రవరి 2వ తేదీన సినిమా విడుదల  

టాలీవుడ్ సర్కిల్‌లో దిల్ రాజుకు ఉన్న బ్రాండ్ గురించి తెలిసిందే. దిల్ రాజు చేయి పడితే ఆ ప్రాజెక్ట్ స్థాయి మారిపోతోంది. నిర్మాతగానూ, డిస్ట్రిబ్యూటర్‌గానూ దిల్ రాజుకు ఉన్న అనుభవం అటువంటిది. ఓ సినిమాను అంచనా వేయడంలో ఆయన శైలి ప్రత్యేకం. అలాంటి దిల్ రాజు ప్రస్తుతం లక్ష్ చదలవాడ సినిమాకి సంబంధించిన నైజాం - వైజాగ్ హక్కుల్ని తీసుకున్నారు. దీంతో 'ధీర' మీద అందరి దృష్టి మరింతగా పడింది.

లక్ష్ చదలవాడ ‘ధీర’ అంటూ ఓ మంచి కమర్షియల్ సబ్జెక్టుతో రాబోతున్న సంగతి తెలిసిందే.   వలయం ..  గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల తరువాత లక్ష్ మరోసారి మాస్ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్దమయ్యాడు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మించారు.  విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్ మీద అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. 

ఆల్రెడీ 'ధీర' గ్లింప్స్, టీజర్ ఇలా అన్నీ కూడా సినిమా మీద బజ్‌ను క్రియేట్ చేశాయి. సాయి కార్తీక్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది. ఇక దిల్ రాజు బ్రాండ్ మీద ఈ చిత్రం ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాలో నేహా పఠాన్ - సోనియా బన్సాల్ కథానాయికలుగా మెరవనున్నారు.


More Telugu News