ఆ రోజున ఉదయ్ కిరణ్ ను అలా చూడలేకపోయాను: ఆర్పీ పట్నాయక్

  • యూత్ ను ఊపేసిన ఆర్ఫీ పట్నాయక్ 
  • తనకి మ్యూజిక్ తెలియదని వెల్లడి 
  • బాలు - ఇళయరాజా ఇనిస్పిరేషన్ అంటూ వ్యాఖ్య 
  • ఉదయ్ కిరణ్ పరిస్థితి పట్ల ఆవేదన  
ఆర్పీ పట్నాయక్ .. సంగీత దర్శకుడిగా ఒకానొక దశలో తన హిట్ సాంగ్స్ తో హుషారెత్తించాడు. ఉదయ్ కిరణ్ హీరోగా చేసిన సినిమాలకు ఆయన అందించిన పాటలు బాగా పాప్యులర్ అయ్యాయి. తాజాగా సుమన్ టీవీ వారు నిర్వహిస్తున్న 'మిస్టర్ ఇనిస్పిరేషన్' షోకి ఆర్పీ పట్నాయక్ హాజరయ్యారు. ఆ షోలో ఉదయ్ కిరణ్ టాపిక్ రావడంతో ఆయన స్పందించారు. 

"ఉదయ్ కిరణ్ లో పట్టుదల ఎక్కువ. ఏదైనా అనుకుంటే దానిని పూర్తిచేయడానికి ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించాలనే ఒక బలమైన సంకల్పం ఆయనలో నాకు కనిపించింది. అలాంటి వ్యక్తికి అలాంటి పరిస్థితి రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎంతో స్టార్ డమ్ చూసిన ఉదయ్ కిరణ్, శవాల గదిలో అలా పడున్నాడు .. అక్కడ ఎవరూ లేరు. ఆ దృశ్యం చూసి నేను  తట్టుకోలేకపోయాను" అన్నారు. 

" నాకు మ్యూజిక్ తెలియదు .. పాటలకి ట్యూన్స్ కడతాను .. కానీ అది ఏ రాగంలో ఉందంటే చెప్పలేను. మొదటి నుంచి కూడా బాలుగారు - ఇళయరాజాగారి పాటలను ఎక్కువగా వినేవాడిని. వాళ్లే నా ఇనిస్పిరేషన్ అని చెబుతాను. నా టాలెంటు సంగతి అలా ఉంచితే, నేను ఎంట్రీ ఇచ్చిన సమయం నా కెరియర్ కి ప్లస్ అయిందని నమ్ముతాను" అని చెప్పారు.


More Telugu News