పార్టీ పరంగా తప్పిదాల వల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది: శ్రీనివాస్ గౌడ్
- పదవీకాలం ముగుస్తుండటంతో బీఆర్ఎస్ సర్పంచ్‌లకు సన్మానం
- కార్యకర్తల మనోభావాలను అధిష్ఠానం దృష్టికి తీసుకు వెళతానని హామీ
- రాజకీయ పదవుల కంటే అటెండర్ ఉద్యోగం మేలన్న మున్సిపల్ చైర్మన్
పార్టీ పరంగా కొన్ని తప్పిదాల వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పదవీకాలం ముగుస్తుండటంతో గద్వాలలో బీఆర్ఎస్ సర్పంచ్‌లను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పార్టీ పరంగా కొన్ని తప్పిదాల వల్ల బీఆర్ఎస్ మూడోసారి గెలవలేదన్నారు. కార్యకర్తల మనోభావాలను అధిష్ఠానం దృష్టికి తీసుకు వెళతానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్ కూడా పాల్గొన్నారు. ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలో పదవులపై ఆయన చురక అంటించారు. గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకు గౌరవం దక్కలేదన్నారు. రాజకీయ పదవుల కంటే అటెండర్ ఉద్యోగమే మేలని వ్యాఖ్యానించారు.