నాగబాబు, అంబటి మధ్య సోషల్ మీడియా వార్
- నేను అభిమన్యుడ్ని కాదు... అర్జునుడ్ని అంటూ సీఎం జగన్ వ్యాఖ్యలు
- మీకెందుకు సార్ ఈ ఉదాహరణలు అంటూ నాగబాబు వ్యంగ్యం
- అదే రీతిలో బదులిచ్చిన మంత్రి అంబటి
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు, ఏపీ మంత్రి అంబటి రాంబాబు మధ్య సోషల్ మీడియా యుద్ధం జరుగుతోంది.
భీమిలిలో నిర్వహించిన సిద్ధం సభలో సీఎం జగన్ మాట్లాడుతూ, "పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి నేను అభిమన్యుడ్ని కాదు... అర్జునుడ్ని" అంటూ వ్యాఖ్యానించారు.
నాగబాబు ఎక్స్ లో స్పందిస్తూ... "వెంకటేశ్వరస్వామి ప్రసాదాలు టిష్యూ పేపర్లో చుట్టి పక్కనపెట్టే మీకెందుకండీ రామాయణ, మహాభారత ఉదాహరణలు?" అంటూ దెప్పిపొడిచారు.
నాగబాబు వ్యాఖ్యలకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. "పవిత్ర దీపారాధనతో సిగరెట్ ముట్టించుకునే మీకెందుకు సార్ ఈ ఉదాహరణలు!" అంటూ నాగబాబును ట్యాగ్ చేశారు.