రాజీనామా ఆమోదంపై గంటా పిటిషన్.. నోటీసులు జారీ చేసిన హైకోర్టు
- 2021లో గంటా చేసిన రాజీనామాను ఆమోదించిన స్పీకర్
- నిబంధనల ప్రకారం రాజీనామా ఆమోదం జరగలేదని హైకోర్టులో గంటా పిటిషన్
- కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్ న్యాయశాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు
విశాఖ నార్త్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించిన సంగతి తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరి 12న ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేశారు. ఈ రాజీనామాను అప్పటి నుంచి పెండింగ్ లో పెట్టిన స్పీకర్ తమ్మినేని గత మంగళవారం ఆమోదించారు. దీంతో, గంటా హైకోర్టులో పిటిషన్ వేశారు.
తన రాజీనామా ఆమోదం నిబంధనల ప్రకారం జరగలేదని తన పిటిషన్ లో గంటా పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్ న్యాయశాఖ కార్యదర్శికి, చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ కు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.