సుధా మూర్తికి ఆటోలో ప్రపోజ్ చేసిన ఇన్ఫీ నారాయణమూర్తి

  • తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్న ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు
  • ఆటో డ్రైవర్‌కు కన్నడ రాకపోవడంతో తమకు కావాల్సిన ప్రైవసీ దక్కిందని వెల్లడి
  • మధ్య తరగతికి చెందిన తమకు అప్పట్లో ఆటో ప్రయాణం ఓ లగ్జరీ అని వ్యాఖ్య
1990ల్లో భారత్ చేపట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితాల్లో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా ఒకటి. మధ్యతరగతి సామాన్య నేపథ్యం కలిగిన నారాయణమూర్తి.. ఈ సంస్కరణల ఊతంతోనే ఇన్ఫోసిస్‌ను ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దారు. ఇటీవల కాలంలో ఆయన పాత జ్ఞాపకాల గురించి మీడియాతో పంచుకుంటున్నారు. తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి కూడా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అప్పట్లో ఆటోలో ప్రయాణిస్తూ సుధా మూర్తి ముందు తన ప్రేమ గురించి ప్రస్తావించిన విషయాన్ని ఆయన వెల్లడించారు. 

‘‘మాది చిన్న ప్రపంచం. మధ్యతరగతి నేపథ్యం. మాకున్న వనరులు పరిమితం. అప్పట్లో మాకు ఆటో ప్రయాణం కూడా ఓ లగ్జరీ. ఆ రోజు మేము కన్నడలో మాట్లాడుకుంటున్నాం. ఆటో డ్రైవర్‌కు కన్నడ రాదు. మేము మాట్లాడుకునేది అతడికి అర్ధం కాదు. ఇది మాకు కావాల్సిన ప్రైవసీ ఇచ్చింది. మనసులో మాట పంచుకునేందుకు ఇదే సరైన అవకాశంగా భావించాము’’ అని నాటి విషయాల్ని నారాయణమూర్తి చెప్పుకొచ్చారు.


More Telugu News