సినీ నటుడు వేణు తొట్టెంపూడి తండ్రి కన్నుమూత
- వేణు తండ్రి ప్రొఫెసర్ తొట్టెంపూడి సుబ్బారావు కన్నుమూత
- ఆయన వయసు 92 సంవత్సరాలు
- మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు
టాలీవుడ్ హీరో వేణు తొట్టెంపూడి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి ప్రొఫెసర్ తొట్టెంపూడి వెంకట సుబ్బారావు కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధింత సమస్యలతో ఆయన ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీనగర్ కాలనీలోని స్టీల్ అండ్ మైన్స్ కాంప్లెక్స్ వద్ద సందర్శనార్థం ఉంచుతారు. జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. వేణు తండ్రి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు.