అత్యుత్సాహానికి పోయిన ఆస్ట్రేలియా.. సొంతగడ్డపై విండీస్ చేతిలో ఘోర పరాభవం
- 27 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై విండీస్ టెస్టు విజయం
- 7 వికెట్లు తీసి కంగారూలను మట్టికరిపించిన షమర్ జోసెఫ్
- తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి మూల్యం చెల్లించుకున్న కమిన్స్ సేన
ఆస్ట్రేలియా గడ్డపై వెస్టిండీస్ జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరిగిన రెండో టెస్టులో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 27 ఏళ్ల తర్వాత కంగారూ గడ్డపై ఆ ఘనత సాధించింది. కరీబియన్ జట్టు చివరిసారి 1997లో ఆస్ట్రేలియాలో ఆ జట్టుపై 207 పరుగులతో విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు మరో విజయం అందుకుంది. నిజానికి ఈ టెస్టులో ఓటమిని విండీస్ చేజేతులా కొనితెచ్చుకుంది.
విండీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ అత్యుత్సాహానికి పోయి 289/9 వద్ద డిక్లేర్ చేసింది. అప్పటికి కెప్టెన్ కమిన్స్ అర్ధ సెంచరీ పూర్తిచేసి 64 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆలౌట్ అయ్యే వరకు ఆట కొనసాగి ఉంటే ఖాతాలో మరిన్ని పరుగులు వచ్చి ఉండేవి. అయితే, విండీస్‌ను త్వరగా ఔట్ చేయాలన్న ఉద్దేశంతో ఇన్నింగ్స్‌ను త్వరగా డిక్లేర్ చేసి మూల్యం చెల్లించుకుంది.
అనుకున్నట్టే విండీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకే ఆలౌట్ చేసినప్పటికీ బ్యాటింగ్‌లో తడబడి ఓటమి పాలైంది. విండీస్ నిర్దేశించిన 216 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఉఫ్‌మని ఊదేసేదే. అంచనాలకు తగ్గట్టుగానే 113/2తో నాలుగో రోజు విజయం దిశగా దూసుకెళ్లింది. అయితే, ఆ తర్వాత 94 పరుగుల వ్యవధిలో మ్యాచ్ మొత్తం విండీస్‌వైపు టర్న్ అయింది. వికెట్ల వేటలో చెలరేగిపోయిన షమర్ జోసెఫ్ ఆసీస్‌కు పట్టపగలే చుక్కలు చూపించాడు. ఏడు వికెట్లు తీసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అతడి దెబ్బకు ఆస్ట్రేలియా 207 పరుగులకే కుప్పకూలింది. స్మిత్ (91) పోరాడినప్పటికీ జట్టును మాత్రం ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. దీంతో రెండు టెస్టుల సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది.