వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు రాజమండ్రికి వస్తే నా ఇంటికి రాకుండా వెళ్తుందా?: ఉండవల్లి అరుణ్ కుమార్

  • క్రియాశీల రాజకీయాల్లోకి రావడం లేదని క్లారిటీ ఇచ్చిన ఉండవల్లి
  • షర్మిలతో ఇటీవల భేటీ నేపథ్యంలో మీడియాకు స్పష్టత నిచ్చిన మాజీ ఎంపీ
  • వైఎస్ జగన్ వర్సెస్ షర్మిల వ్యవహారంపై స్పందించబోనన్న ఉండవల్లి అరుణ్ కుమార్
తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి రాబోనని కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. ఇటీవలే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రాజమండ్రి వెళ్లి ఆయనతో ప్రత్యక్షంగా భేటీ కావడంపై మీడియా ప్రశ్నించగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు రాజమండ్రికి వస్తే తన ఇంటికి రాకుండా వెళ్తుందా అని అన్నారు. క్రియాశీల రాజకీయాల్లోకి రాబోనని తేల్చిచెప్పారు. ఏపీలో కాంగ్రెస్ విషయానికి వస్తే 2019 కంటే 2024లో పరిస్థితి మెరుగ్గానే ఉంటుందని ఉండవల్లి అరుణ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల వ్యవహారంపై తాను స్పందించబోనని ఉండవల్లి అన్నారు. కుటుంబ విషయాల గురించి తాను మాట్లాడబోనని, పబ్లిక్‌కు సంబంధించిన విషయాలపై మాత్రమే మాట్లాడతానని చెప్పారు. కుటుంబ విషయాలు వాళ్లే చూసుకుంటారని అన్నారు. కుటుంబ తగాదాలను కూడా బహిరంగంగా మాట్లాడుకుంటున్నారని మీడియా ప్రశ్నించగా ఆయన ఈ విధంగా స్పందించారు. రాజమండ్రిలో ఆదివారం జరిగిన ఓ పుస్తకావిష్కరణలో అరుణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్, లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ కూడా పాల్గొన్నారు.


More Telugu News