శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధాన్ని ఎత్తివేసిన ఐసీసీ

  • ఇటీవల వరల్డ్ కప్ లో టీమిండియా చేతిలో లంక ఘోర పరాజయం
  • లంక క్రికెట్ బోర్డును రద్దు చేసిన శ్రీలంక క్రీడల మంత్రి
  • క్రికెట్ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం నిబంధనలకు విరుద్ధమన్న ఐసీసీ
  • గత నవంబరులో శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధం
శ్రీలంక క్రికెట్ బోర్డుపై గతంలో విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ఎత్తివేసింది. క్రికెట్ పాలన వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం నిబంధనలకు విరుద్ధమంటూ గతేడాది నవంబరులో శ్రీలంక క్రికెట్ బోర్డుపై ఐసీసీ నిషేధం విధించింది. 

వరల్డ్ కప్ లో టీమిండియా చేతిలో శ్రీలంక జట్టు ఘోర పరాజయం నేపథ్యంలో, లంక క్రికెట్ బోర్డును శ్రీలంక క్రీడల మంత్రి రద్దు చేశారు. అయితే, ప్రభుత్వం క్రికెట్ బోర్డు కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం ఐసీసీ రాజ్యాంగానికి విరుద్ధం. ఈ కారణంగానే శ్రీలంక క్రికెట్ బోర్డుపై ఐసీసీ నిషేధం విధించింది. దాంతో, శ్రీలంకలో నిర్వహించాల్సిన అండర్-19 వరల్డ్ కప్ కూడా దక్షిణాఫ్రికాకు తరలిపోయింది. 

తాజాగా, నిషేధం నిర్ణయాన్ని సమీక్షించిన ఐసీసీ పాలకవర్గం నిషేధాన్ని తొలగించాలని తీర్మానించింది. తక్షణమే నిషేధం తొలగింపు అమల్లోకి వస్తుందని ఐసీసీ నేడు ఓ ప్రకటనలో తెలిపింది.


More Telugu News