సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నిర్మాతల మండలి, ఫిలిం చాంబర్ ప్రముఖులు
- ఇటీవల తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి
- సీఎం రేవంత్ రెడ్డిని వరుసగా కలుస్తున్న సినీ ప్రముఖులు
- సినీ పరిశ్రమకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ఆయనతో టాలీవుడ్ ప్రముఖుల భేటీలు కొనసాగుతున్నాయి. ఇవాళ కూడా పలువురు సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ప్రముఖ నిర్మాత తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిల్ రాజు, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు కేఎల్ దామోదర ప్రసాద్, నిర్మాతల మండలి కార్యదర్శి వైవీఎస్ చౌదరి, తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, తెలంగాణ ఫిలిం చాంబర్ కార్యదర్శి కె.అనుపమ రెడ్డి, ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధ్యక్షుడు పీవీ రవికిశోర్, ఉపాధ్యక్షురాలు సుప్రియ యార్లగడ్డ, ట్రెజరర్ బాపినీడు, సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్, కార్యదర్శి టీఎస్ఎన్ దొర నేడు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సినీ రంగం గురించి సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.