ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మరోసారి బెర్నార్డ్ ఆర్నాల్ట్

  • మళ్లీ నెంబర్ వన్ పీఠాన్ని చేజిక్కించుకున్న బెర్నార్డ్ ఆర్నాల్ట్
  • ఆర్నాల్ట్ నికర ఆస్తుల విలువ రూ.17 లక్షల కోట్లు
  • రెండో స్థానానికి పడిపోయిన ఎలాన్ మస్క్
ఫ్రెంచ్ కుబేరుడు బెర్నార్ట్ ఆర్నాల్ట్ (74) ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించారు. గతంలో ఆయన ఈ స్థానాన్ని ఎలాన్ మస్క్ కు కోల్పోయారు. తాజాగా, మరోసారి నెంబర్ వన్ పీఠం చేజిక్కించుకున్నారు. ఈ మేరకు ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ వెల్లడించింది. 

లగ్జరీ ఉపకరణాల పరిశ్రమ ఎల్వీఎంహెచ్ కు చైర్మన్, సీఈవో గా కొనసాగుతున్న ఆర్నాల్ట్, ఆయన కుటుంబం నికర ఆస్తుల విలువ రూ.17,20,616 కోట్లు. గతవారం అమెరికన్ స్టాక్ ఎక్చేంజిలో ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా షేర్లు భారీగా పతనం అయ్యాయి. దాదాపు రూ.6 లక్షల కోట్ల డాలర్ల మేర మస్క్ కు నష్టం వాటిల్లింది. 

అదే సమయంలో, బెర్నార్డ్ ఆర్నాల్ట్ నికర సంపద రూ.2 లక్షల కోట్ల మేర పెరిగింది. ప్రస్తుతం ఫోర్బ్స్ జాబితాలో మస్క్ రూ.16 లక్షల కోట్ల సంపదతో రెండో స్థానానికి పడిపోయారు.


More Telugu News