తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పొడిగింపుపై కీలక ప్రకటన
- పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పొడిగించేది లేదన్న పోలీసులు
- రాయితీతో కూడిన చెల్లింపులకు నాలుగు రోజుల సమయమే ఉందని వెల్లడి
- ఈ నెలాఖరు వరకు రాయితీతో కూడిన చెల్లింపుకు అవకాశం
తెలంగాణలో పెండింగ్ చలాన్ల రాయితీ గడువును మరోసారి పొడిగించే అవకాశం లేదని పోలీసులు స్పష్టం చేశారు. గత ఏడాది డిసెంబర్ 27వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లను రాయితీతో చెల్లించేందుకు అవకాశమిచ్చారు. తొలుత పదిహేను రోజులపాటు అవకాశమిచ్చిన పోలీసులు ఆ తర్వాత జనవరి 10 నుంచి ఈ నెలాఖరు వరకు పొడిగించారు. తద్వారా పెండింగ్ చలాన్ల రాయితీ చెల్లింపులకు నెల రోజులకు పైగా సమయం దొరికింది.
అయితే ఇక గడువు పొడిగింపు మాత్రం ఉండదని పోలీసులు స్పష్టం చేశారు. రాయితీతో చెల్లించేందుకు మరో నాలుగు రోజుల గడువు మాత్రమే ఉందని పోలీసులు తెలిపారు. 3.59 కోట్ల పెండింగ్ చలాన్లకు గాను ఇప్పటి వరకు 1,52,47,864 చలాన్లు చెల్లించారు. వీటి ద్వారా రూ.135 కోట్ల ఆదాయం వచ్చింది.