చిరంజీవిపై నేడు కూడా కొనసాగిన అభినందనల జడివాన
- చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించిన కేంద్రం
- కోలాహలంగా మారిన చిరంజీవి నివాసం
- ప్రముఖులు స్వయంగా వచ్చి మెగాస్టార్ ను అభినందిస్తున్న వైనం
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అభినందనల జడివానలో తడిసి ముద్దవుతున్నారు. కేంద్రం ఆయనకు ప్రతిష్ఠాత్మక పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించడమే అందుకు కారణం. ఇవాళ కూడా చిరంజీవిపై అభినందనల వర్షం కురిసింది.
మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శక రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టార్ ప్రొడ్యూసర్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకృష్ణ నేడు చిరంజీవి నివాసానికి వచ్చారు. దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ కు ఎంపికైన నేపథ్యంలో ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా చిరంజీవి... త్రివిక్రమ్, రాధాకృష్ణతో తన ఆనందాన్ని పంచుకున్నారు.
అటు, 'యానిమల్' చిత్రంతో మరో హిట్ కొట్టిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, 'దసరా' చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా నేడు చిరంజీవిని కలిసినవారిలో ఉన్నారు. హైదరాబాదులోని చిరంజీవి నివాసానికి వచ్చిన వారిరువురు కాసేపు ఆయనతో ముచ్చటించారు. చిరంజీవికి ప్రతిష్ఠాత్మక అవార్డు రావడం పట్ల తమ హర్షం వ్యక్తం చేశారు.