నారా లోకేశ్ యువగళానికి నేటితో ఏడాది పూర్తి

  • 2023 జనవరి 27న యువగళం ప్రారంభం
  • కుప్పంలో తొలి అడుగు వేసిన లోకేశ్
  • ఆ తర్వాత ప్రతి అడుగు ఒక ప్రభంజనమైందన్న టీడీపీ
  • యువగళం ఒక సంచలన చరిత్ర అంటూ ట్వీట్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గతేడాది సరిగ్గా ఇదే రోజున (జనవరి 27) తన యువగళం పాదయాత్రను ప్రారంభించారు. లోకేశ్ యువగళానికి నేటితో ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. 

"జనం బాధలు, ఆకాంక్షలను అర్థం చేసుకోవడానికి, ప్రభుత్వ పీడితులకు నేనున్నానంటూ భరోసా ఇవ్వడానికి, చెలరేగిపోతున్న అరాచకశక్తులను 'ఖబడ్దార్' అని హెచ్చరించడానికి... నారా లోకేశ్ యువగళం ప్రారంభించారు. 2023 జనవరి 27న కుప్పంలోని వరదరాజులు స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తొలి అడుగు వేశారు. ఆ తర్వాత జరిగిందంతా ఒక సంచలన చరిత్ర. లోకేశ్ నాయకత్వ పటిమకు, పట్టుదలకు, సంకల్పానికి నిదర్శనంగా ప్రతి అడుగు ఒక ప్రభంజనమై సాగింది" అంటూ టీడీపీ తన పోస్టులో పేర్కొంది.


More Telugu News