ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఆటోను ఢీ కొట్టిన కారు.. ఒడిశాలో ఏడుగురి మృతి.. వీడియో ఇదిగో!
- సింగిల్ రోడ్ లో అతివేగంగా దూసుకొచ్చిన కారు
- బైక్ ను తప్పించే ప్రయత్నంలో ఆటోను ఢీ కొట్టడంతో ఘోరం
- సీసీటీవీలో రికార్డయిన ప్రమాద ఘటన.. సోషల్ మీడియాలో వైరల్
ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు డ్రైవర్ అతివేగం ఏడుగురి మరణానికి కారణమైంది. సింగిల్ లేన్ రోడ్ లో ముందు వెళుతున్న ఆటోను ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించి బైక్ ను ఢీ కొట్టాడు. ఆపై ఆటోను, మరో బైకర్ ను ఢీ కొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు చనిపోయారని పోలీసులు తెలిపారు. ఒడిశాలోని కోరాపూట్ జిల్లా బోరిగుమ్మ గ్రామ సమీపంలో జరిగిన ఈ ప్రమాద ఘటన మొత్తం అక్కడికి దగ్గర్లోని ఓ హోటల్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బోరిగుమ్మ గ్రామం సమీపంలో శనివారం ఉదయం ఓ స్కార్పియో కారు రెండు బైక్ లను, ఓ ఆటోను ఢీ కొట్టింది. ముందు వెళుతున్న ఆటోను ఓవర్ చేసేందుకు ప్రయత్నించిన స్కార్పియో డ్రైవర్ చివరిక్షణంలో ఎదురుగా వస్తున్న బైక్ ను గమనించాడు. బైక్ ను తప్పించే ప్రయత్నంలో ఆటోను వెనక నుంచి ఢీ కొట్టాడు. కారు బాడీ తగలడంతో ఆ బైకర్ కూడా ఎగిరి కిందపడ్డాడు. మరో బైకర్ ను, పక్కనే వెళుతున్న ట్రాక్టర్ ను కూడా కారు వేగంగా తాకింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. గాయపడ్డ బైకర్లను, ఆటో, కారు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరో నలుగురు చనిపోయారని బీజాపూర్ పోలీసులు తెలిపారు. కాగా, ఆటోలో మొత్తం పదిహేను మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.