రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం... సతీసమేతంగా హాజరైన సీఎం జగన్
- నేడు రిపబ్లిక్ డే
- లాంఛనంగా ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించిన గవర్నర్
- హాజరైన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు విజయవాడ రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆతిథ్యమిచ్చిన ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. అక్కడ అల్పాహార విందు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను వైసీపీ తన సోషల్ మీడియా అకౌంట్లో పంచుకుంది.