రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి: నారా లోకేశ్
- ప్రభుత్వం బకాయిలు చెల్లించడంలేదన్న ప్రైవేటు ఆసుపత్రులు
- ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత
- ప్రైవేటు ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేస్తున్న ప్రభుత్వం
- ప్రభుత్వ నిర్లక్ష్యానికి అమాయకులను బలిపశువులుగా మార్చొద్దన్న లోకేశ్
ఏపీ ప్రభుత్వం బకాయిలు చెల్లించడంలేదంటూ రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయి. దాంతో వైసీపీ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. పలు ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేసింది. ఈ పరిస్థితులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని అన్నారు. అస్తవ్యస్త పాలనతో జగన్ ఖజానా ఖాళీ చేశారని మండిపడ్డారు.
ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ.1200 కోట్లు బకాయిలు పెట్టారని లోకేశ్ ఆరోపించారు. ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతతో పేదల వైద్యం గాలిలో దీపంలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిల విడుదల విషయంలో ప్రభుత్వం చొరవ చూపడంలేదని విమర్శించారు.
వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే, ఆసుపత్రులను డీలిస్ట్ చేస్తూ ప్రభుత్వమే బెదిరింపులకు దిగడం దారుణమని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి అమాయకులను బలిపశువులుగా మార్చొద్దని నారా లోకేశ్ హితవు పలికారు. సామరస్య పూర్వకంగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.