రాజమండ్రి విమానాశ్రయం నుంచి హైదరాబాద్ పయనమైన నారా భువనేశ్వరి

  • ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ముగిసిన భువనేశ్వరి పర్యటన
  • చంద్రబాబు అరెస్ట్ అనంతరం మరణించిన కార్యకర్తల కుటుంబాలకు ఓదార్పు
  • రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తున్న భువనేశ్వరి
  • మూడ్రోజులుగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటన
  • 16 మంది కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ
టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటన ముగిసింది. చంద్రబాబు అరెస్ట్ అనంతరం మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను 'నిజం గెలవాలి' పేరిట నారా భువనేశ్వరి పరామర్శిస్తూ, వారికి రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నారు. 

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఆమె మూడ్రోజుల పాటు పర్యటించారు. మృతి చెందిన 16 మంది కార్యకర్తల కుటుంబాలను స్వయంగా కలిసి వారికి ధైర్యం చెప్పారు. టీడీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని వారికి భరోసానిచ్చారు. కాగా, నేటితో పర్యటన ముగిసిన నేపథ్యంలో, నారా భువనేశ్వరి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుని అక్కడ్నించి హైదరాబాద్ పయనమయ్యారు.


More Telugu News