మెట్రో రైలు ఫేజ్-2 పనులపై స్పందించిన ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

  • రిపబ్లిక్ డే సందర్భంగా మెట్రో రైలు భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ
  • ఫేజ్-2కు సంబంధించి ట్రాఫిక్ సర్వేలు, డీపీఆర్‌ల తయారీ శరవేగంగా సాగుతున్నట్లు వెల్లడి
  • రెండో ఫేజ్ మెట్రో విస్తరణ ద్వారా అన్ని ప్రాంతాలకు సేవలు
మెట్రో రెండో దశ విస్తరణ ప్రతిపాదనలకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయాన్ని అనుసంధానం చేస్తూ డెబ్బై కిలో మీటర్ల మేర ఫేజ్-2 విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా మెట్రో రైలు భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మెట్రో ఫేజ్-2కు సంబంధించి ట్రాఫిక్ సర్వేలు, డీపీఆర్‌ల తయారీ శరవేగంగా సాగుతున్నట్లు వెల్లడించారు. రెండో ఫేజ్ మెట్రో విస్తరణ ద్వారా నగరంలోని అన్ని ప్రాంతాలకు సేవలు అందుతాయని తెలిపారు.


More Telugu News