శాసన సభ ఆవరణలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్
- హైదరాబాద్‌లో రౌండ్ టేబుల్ సమావేశం
- పూలే విగ్రహం ఏర్పాటు కోసం బీసీలు ఏకం కావాలని పిలుపు
- ఏప్రిల్ 11 లోగా విగ్రహం ఏర్పాటుపై సానుకూల ప్రకటన రావాలన్న కవిత
శాసన సభ ఆవరణలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పూలే విగ్రహం ఏర్పాటుకు బీసీలు అందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. బీసీల అభ్యున్నతే ధ్యేయంగా భారత్ జాగృతి పోరాటం చేస్తుందన్నారు. ఇందులో భాగంగా అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహం ఏర్పాటు సాధన లక్ష్యంగా ఉద్యమిస్తోందన్నారు. ఏప్రిల్ 11 లోపల విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రావాలని విజ్ఞప్తి చేశారు. బడుగుల కోసం పని చేసిన సంస్కర్త పూలే అని.. ఆయన విగ్రహం ఏర్పాటు అవసరమన్నారు. బడుగుల రాజ్యాధికారం కోసం పూలే విగ్రహం కోసం అడగడం ఇది మొదటి అడుగు మాత్రమే అన్నారు.
అసెంబ్లీ ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేయాలని స్పీకర్‌కు వినతి పత్రాన్ని ఇచ్చినట్లు తెలిపారు. ఇందుకోసం తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మద్దతు కూడగట్టడానికి లేఖలు రాసినట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయించడానికి పోరాటం చేస్తామని తెలిపారు. ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమించి సాధించామన్నారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళల కోటా కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతోమంది సంఘసంస్కర్తల జయంతులను అధికారికంగా నిర్వహించిందన్నారు.