12వ ఏట నుంచే రంగస్థల వేదికపైకి.. 19వేల ప్రదర్శనలిచ్చిన సమ్మయ్య

  • సమ్మయ్యది జనగామ జిల్లాలోని అప్పిరెడ్డిపల్లి
  • తండ్రి నుంచి వారసత్వంగా కళను పుణికిపుచ్చుకున్న సమ్మయ్య
  • చదువుకున్నది ఐదో తరగతి వరకే
  • ‘చిందుయక్ష కళాకారుల సంఘం’, ‘గడ్డం సమ్మయ్య యువ కళాక్షేత్రం’ స్థాపన
  • భార్య శ్రీరంజని కూడా యక్షగాన కళాకారిణే
కళల విభాగంలో పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన చిందుయక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య (62)ది నిరుపేద కుటుంబం. జనగామ జిల్లా దేవురుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన ఆయన ఐదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. తండ్రి రామస్వామి నుంచి కళను వారసత్వంగా పొందిన సమ్మయ్య 12వ ఏట నుంచే రంగస్థల వేదికపై రకరకాల పాత్రలు వేస్తూ యక్షగానం కళను ప్రదర్శిస్తున్నారు. గత ఐదు దశాబ్దాల్లో 19 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. 

పౌరాణిక కథలతోపాటు పలు సామాజిక అంశాలపై ప్రజల్లో ప్రచారం చేశారు. అక్షరాస్యత, పర్యావరణ పరిరక్షణపై పాటలు, పద్యాలతో ఆకట్టుకున్నారు. ‘చిందుయక్ష కళాకారుల సంఘం’, ‘గడ్డం సమ్మయ్య యువ కళాక్షేత్రం’ వంటివి స్థాపించి కళను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన భార్య శ్రీరంజని కూడా యక్షగాన కళాకారిణే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గతంలో ‘కళారత్న హంస’ పురస్కారం అందుకున్నారు. ఇటీవల అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా రామాయణ గాధకు సంబంధించి ఐదు ప్రదర్శనలు ఇచ్చారు.


More Telugu News