ఇళయరాజా కుటుంబంలో తీవ్ర విషాదం... కుమార్తె భవతారిణి కన్నుమూత
- కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న భవతారిణి
- శ్రీలంకలో ఆయుర్వేద చికిత్స
- ఈ సాయంత్రం తుదిశ్వాస విడిచిన వైనం
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇళయరాజా కుమార్తె భవతారిణి కన్నుమూశారు. ఆమె క్యాన్సర్ తో బాధపడుతున్నారు. కొంతకాలంగా శ్రీలంకలో ఆయుర్వేద చికిత్స పొందుతున్న భవతారిణి ఈ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. భవతారిణి వయసు 47 సంవత్సరాలు. కన్నబిడ్డ మృతితో ఇళయరాజా శోకసంద్రంలో మునిగిపోయారు.
చెన్నైలోని రోసరీ మెట్రిక్యులేషన్ స్కూల్లో విద్యాభ్యాసం చేసిన భవతారిణి... తండ్రి బాటలోనే సంగీతాన్నే కెరీర్ గా ఎంచుకున్నారు. గాయనిగా, సంగీత దర్శకురాలిగా గుర్తింపు అందుకున్నారు. తండ్రి ఇళయరాజా, సోదరులు యువన్ శంకర్ రాజా, కార్తీక్ ఇళయారాజాల సంగీత దర్శకత్వంలో భవతారిణి చాలా పాటలు పాడారు.
ఇళయారాజా సంగీత దర్శకత్వంలో నేపథ్య గాయనిగా 'భార్తీ' చిత్రంలో 'మైల్ పోలా పొణ్ణు ఒణ్ణు' అనే పాటకు జాతీయ అవార్డు అందుకున్నారు. భవతారిణి చెన్నైలోని ఓ యాడ్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ శబరిరాజ్ ను పెళ్లాడారు.