టీఎస్ ఈఏపీసెట్‌గా మారిన తెలంగాణ ఎంసెట్.. ఆయా ప్రవేశ పరీక్షల తేదీలు ఇవిగో

  • ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నత విద్యా మండలి
  • తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌గా మార్పు
  • టీఎస్ ఈఏపీసెట్ సహా ఎనిమిది ఉమ్మడి ప్రవేశ పరీక్ష తేదీల విడుదల
తెలంగాణలో ఎంసెట్ పేరును టీఎస్ ఈఏపీసెట్‌గా మారుస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ నీట్ పరిధిలోకి వెళ్లడంతో తెలంగాణ ప్రభుత్వం 'ఎం' స్థానంలో ఫార్మాను జత చేసింది. తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఈఏపీసెట్)గా మార్చింది. 

ఇదిలా ఉండగా టీఎస్ ఈఏపీసెట్‌తో పాటు ఎనిమిది ప్రవేశ పరీక్షలకు తేదీలను ఖరారు చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే తేదీలు... నిర్వహించే యూనివర్సిటీల వివరాలు ఇలా ఉన్నాయి... ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు, షెడ్యూల్, రిజిస్ట్రేషన్ ఫీజులు సంబంధిత పరీక్షల కన్వీనర్లు వెల్లడిస్తారని తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

తెలంగాణ ఈ-సెట్ - ఉస్మానియా యూనివర్సిటీ - మే 6.

టీఎస్ ఈఏపీసెట్ - జేఎన్‌టీయూహెచ్ - (ఇంజినీరింగ్) మే 9 నుంచి 11 వరకు, (అగ్రికల్చరల్ అండ్ ఫార్మా) మే 12, 13.

టీఎస్ ఎడ్‌సెట్ - మహాత్మా గాంధీ యూనివర్సిటీ - మే 23.

టీఎస్ లా సెట్, పీజీఎల్ సెట్ - ఉస్మానియా యూనివర్సిటీ - జూన్ 3.

టీఎస్ ఐసెట్ - కాకతీయ యూనివర్సిటీ - జూన్ 4, 5.

టీఎస్ పీజీఈసెట్ - జేఎన్‌టీయూహెచ్ - జూన్ 6 నుంచి 8 వరకు.

టీఎస్ పీఈసెట్ - శాతవాహన యూనివర్సిటీ - జూన్ 10 నుంచి 10 వరకు.


More Telugu News