గెలిచాక కుటుంబంలో అందరికీ పదవులు ఇవ్వాలంటే ఎలా?: షర్మిలకు పేర్ని నాని కౌంటర్
- తమ కుటుంబంలో చీలికలకు జగనే కారణమన్న షర్మిల
- జగన్ ఎలా కారణమో చెప్పాలన్న పేర్ని నాని
- షర్మిలను కావాలనే జగన్ పైకి ఉసిగొల్పుతున్నారని వ్యాఖ్యలు
- కాంగ్రెస్ వెనుక ఉన్నది చంద్రబాబేనని విమర్శ
వైఎస్సార్ కుటుంబంలో చీలికలకు జగనే కారణమని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దీనిపై ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించారు. నాడు అన్న కోసం షర్మిల పాదయాత్ర చేసిందని... కానీ, తాము ఏ సంబంధం లేకపోయినా జగన్ కోసం జెండాలు మోశామని అన్నారు.
ఎన్నికల్లో తన గెలుపు కోసం కుటుంబం మొత్తం ప్రచారం చేసిందని, అలాగని కుటుంబంలో అందరికీ పదవులు ఇవ్వడం కుదరదు కదా అని పేర్ని నాని వ్యాఖ్యానించారు. షర్మిలను ఉద్దేశపూర్వకంగానే జగన్ పైకి ఉసిగొల్పుతున్నారని, కాంగ్రెస్ వెనుక ఉన్నది చంద్రబాబేనని ఆరోపించారు.
వైఎస్సార్ కుటుంబంలో చీలికలకు జగన్ ఎలా కారణమో చెప్పాలని షర్మిలను నిలదీశారు. ఏపీ పరిస్థితులపై షర్మిలకు అవగాహన లేకనే ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు.