తూర్పు గోదావరి జిల్లా క్రైస్తవ మతపెద్దలతో పవన్ కల్యాణ్ సమావేశం
- పవన్ ను కలిసిన క్రైస్తవ మతపెద్దలు
- పవన్ సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు
- జనసేనానికి ఆశీస్సులు అందజేసిన పాస్టర్లు
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ కార్యకలాపాల్లో వేగం పెంచారు. ఇవాళ తూర్పు గోదావరి జిల్లా క్రైస్తవ మతపెద్దలతో సమావేశం అయ్యారు. వారు చెప్పిన అంశాలను పవన్ శ్రద్ధగా విన్నారు. వారి సమస్యలను ఆలకించారు. పవన్ ను కలిసిన సందర్భంగా క్రైస్తవ మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జనసేనానికి ఆశీస్సులు అందించారు. ఆయనకు క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్ ను బహూకరించారు. ఈ భేటీ సందర్భంగా వారు పవన్ కు వినతిపత్రం కూడా సమర్పించారు. ఈ సందర్భంగా భావోద్వేగాలకు గురైన ఓ పాస్టర్ ను పవన్ హృదయానికి హత్తుకున్నారు.