బావ - బావమరిది కథలో మోహన్ లాల్ - రానా!
- రిపీట్ కానున్న తేజ - రానా కాంబో
- సెట్స్ పైకి వెళ్లనున్న 'రాక్షసరాజు'
- కీలకమైన పాత్రలో మోహన్ లాల్
- యాక్షన్ - ఎమోషన్ ప్రధానంగా నడిచే కథ
తేజ దర్శకత్వంలో రానా కథానాయకుడిగా 'నేనే రాజు - నేనే మంత్రి' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. హీరోగా ఈ సినిమా రానాకి హిట్ ఇచ్చింది. అలాగే చాలా కాలం తరువాత తేజకి కూడా ఆ సినిమా విజయాన్ని అందించింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో 'రాక్షసరాజు' అనే సినిమా రూపొందనున్నట్టుగా వార్తలు వచ్చాయి.
కొంతకాలంగా ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్న రానా - తేజ ఇద్దరూ కూడా, ఈ సినిమాతో మళ్లీ సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. యాక్షన్ - ఎమోషన్ ప్రధానంగా నడిచే కథ ఇది. ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగా ఉంటాయని అంటున్నారు.
ఇది 'బావ - బావమరిది' కథ అని తెలుస్తోంది. తన బావ అంటే ఆ బావమరిదికి ఎంతో అభిమానం .. ఆయన మాట అంటే వేదం. అయన కోసం ఆ బావమరిది ఎంతదూరమైనా వెళతాడు. ఎంతకైనా తెగిస్తాడు. అలాంటి బావమరిది పాత్రను రానా పోషించనుండగా, బావ పాత్ర కోసం మోహన్ లాల్ ను సంప్రదిస్తున్నట్టుగా సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట.