ధైర్యం, నమ్మకం పోయి జగన్ లో భయం మొదలైంది: ఎంఏ షరీఫ్

  • తాను చక్కగా పాలించానని, హ్యాపీగా దిగిపోతానని సీఎం జగన్ వ్యాఖ్యలు
  • తన కుటుంబంలో చిచ్చు పెట్టారంటూ విసుర్లు
  • జగన్ వ్యాఖ్యలు ఆయనలోని భయానికి సంకేతాలన్న షరీఫ్
  • ప్రజాగ్రహం తప్పదని అర్థమైపోయిందని వెల్లడి
ప్రజాగ్రహం తప్పదని గ్రహించే సీఎం జగన్ స్వరం మార్చారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ విమర్శించారు. ధైర్యం, నమ్మకం పోయి జగన్ లో భయం మొదలైందని అన్నారు.

2021లో "నా వెంట్రుక కూడా పీకలేరు" అన్న’ వ్యక్తి... ఇప్పుడు "సంతోషంగా దిగిపోతాను" అనడానికి కారణం ప్రజాగ్రహమేనని స్పష్టం చేశారు. డబ్బులిచ్చి మరీ ఇంటర్వ్యూ పేరుతో ఓ జాతీయ మీడియా సంస్థకు జగన్ చెప్పిన విషయాలు ఆయన్ని పట్టిపీడిస్తున్న భయానికి సంకేతాలు అని షరీఫ్ పేర్కొన్నారు. 

"ప్రజాగ్రహం తప్పదని గ్రహించే చివర్లో అప్రజాస్వామిక విధానాలు నమ్ముకున్నాడు. జగన్ ఎన్ని కుయుక్తులు పన్నినా... ఎంత మొసలి కన్నీరు కార్చినా ప్రజలు ఆయన్ని, ఆయన పార్టీని తరిమికొట్టడం ఖాయం. బాబాయ్ ను తనకు పోటీగా పెట్టారంటున్న జగన్ రెడ్డి... అదే బాబాయ్ కి గొడ్డలిపోటు వేసింది నిజం కాదా? 

ప్రజల మనసుల్లో ఉన్నదే షర్మిల చెబుతున్నారు. షర్మిల మాటలు ప్రజలు నమ్మకుండా చేయాలన్న దురుద్దేశంతోనే జగన్ రెడ్డి... చంద్రబాబు పేరు తీసుకొచ్చాడు. తన కుటుంబం నుంచి తాను తప్ప రాజకీయంగా ఎవరూ ఎదగడం జగన్ కు ఇష్టం లేదు. జగన్ కుటుంబంలో చిచ్చుపెట్టాల్సిన అవసరం టీడీపీకి, చంద్రబాబుకి లేదు" అని మహ్మద్ షరీఫ్ స్పష్టం చేశారు.


More Telugu News