తమిళనాడులో ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం.. నలుగురి మృతి.. మరో 8 మందికి తీవ్రగాయాలు
- ధర్మపురి జిల్లాలోని తొప్పూర్ ఘాట్ రోడ్డులో ఘటన
- తొలుత ట్రక్కును ఢీకొన్న మరో ట్రక్కు
- మధ్యలో ఇరుక్కుపోయిన కారు
- వాటిని ఢీకొట్టి బ్రిడ్జికింద పడిన పలు వాహనాలు
- మృతులకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి స్టాలిన్
తమిళనాడులోని ధర్మపురి జిల్లా తొప్పూర్ ఘాట్‌రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ప్రమాదానికి సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వరుసగా నాలుగు వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి.
తొలుత ఓ ట్రక్కు మరో ట్రక్కుపైకి దూసుకెళ్లింది. దీంతో ట్రక్కు బ్రిడ్జిపై నుంచి కిందపడింది. ఈ క్రమంలో ఆ రెండింటి మధ్య చిక్కుకుని ఓ కారు నుజ్జునుజ్జు అయింది. వెనకనుంచి వస్తున్న మరికొన్ని వాహనాలు నియంత్రించుకోలేక అవి కూడా వాహనాలను ఢీకొట్టి బ్రిడ్జి నుంచి కిందపడ్డాయి. ప్రమాదం తర్వాత ఓ ట్రక్కులో మంటలు అంటుకున్నాయి.
ప్రమాదవార్త అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.