ఇంగ్లండ్‌ను ముప్పుతిప్పలు పెడుతున్న అశ్విన్.. 5 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయిన పర్యాటక జట్టు
- టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్
- రెండు వికెట్లు పడగొట్టిన అశ్విన్
- జడేజాకు ఓ వికెట్
ఉప్పల్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్‌కు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ కేవలం 5 పరుగుల తేడాతో వరుసగా మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
55 పరుగుల వద్ద ఓపెనర్ బెన్ డకెట్(35)ను అశ్విన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత మూడు పరుగులకే ఒల్లీ పోప్(1))ను రవీంద్ర జడేజా వెనక్కి పంపాడు. అనంతరం మరో రెండు పరుగుల తర్వాత జాక్ క్రాలీ (20)ని అశ్విన్ అవుట్ చేశాడు.
స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ఆ తర్వాత జాగ్రత్త పడింది. ప్రతి బంతినీ ఆచితూచి ఎదుర్కొంటోంది. పర్యాటక జట్టు ప్రస్తుతం మూడు వికెట్ల నష్టానికి 86 పరుగులతో ఉంది. జో రూట్ (13), జానీ బెయిర్‌స్టో (16) క్రీజులో ఉన్నారు.