అమరావతి ఉద్యమానికి నేటితో 1,500 రోజులు

  • అమరావతి పరిరక్షణే ఊపిరిగా ఉద్యమం
  • ఎన్నో కేసులు పెట్టినా వెనకడుకు వేయని రైతులు, మహిళలు
  • రైతులకు అండగా నిలబడ్డ విపక్ష పార్టీలు
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం 1,500 రోజులకు చేరుకుంది. అమరావతి పరిరక్షణే ఊపిరిగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా వారు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. సంవత్సరాలు గడిచిపోతున్నా... అమరావతి రైతులు, మహిళలు, కూలీలు, వృద్ధులు సంకల్ప బలాన్ని కోల్పోలేదు. తమపై ఎన్నో కేసులను పెట్టినా వారు వెనకడుగు వేయలేదు. దేశ చరిత్రలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రాంత ప్రజలు ఇంత సుదీర్ఘంగా ఉద్యమించడం ఇదే తొలిసారి కావచ్చు.

మరోవైపు తమ ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మద్దతును కూడగట్టేందుకు అమరావతి రైతులు 2021 నవంబర్ 1న 'న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు' పేరుతో తుళ్లూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్ర విజయవంతమయింది. అనంతరం 2022 సెప్టెంబర్ 12న శ్రీకాకుళంలోని అరసవల్లి వరకు పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్రకు దారిపొడవునా వైసీపీ శ్రేణులు అడ్డుతగిలాయి. అడ్డంకులను ఎదుర్కొంటూనే రామచంద్రాపురం వరకు పాదయాత్ర చేశారు. ఆ తర్వాత ఆపేయాల్సి వచ్చింది. అమరావతి రైతులకు విపక్ష పార్టీలన్నీ అండగా ఉన్నాయి. 


More Telugu News