కోడి కత్తి శీను బెయిల్ కేసు... తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు
- బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తొలుత ఎన్ఐఏ కోర్టును ఆశ్రయించిన కోడి కత్తి శీను
- ఎన్ఐఏ కోర్టు నిరాకరించడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు
- హత్యాయత్నం కేసులో నాలుగున్నరేళ్లుగా జైల్లో ఉంచడం సరికాదన్న న్యాయవాది
- జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా కావాలనే విచారణ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారని వాదనలు
కోడి కత్తి శ్రీనివాసరావు బెయిల్ కేసులో తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోడి కత్తి శ్రీను పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. హత్యాయత్నం కేసులో నాలుగున్నరేళ్లకు పైగా జైల్లో మగ్గుతున్నానని... తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోడి కత్తి శీను గతంలో ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. బెయిల్ ఇచ్చేందుకు ఎన్ఐఏ కోర్టు నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు.
ముఖ్యమంత్రి జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా కావాలనే విచారణ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారని, దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోడి కత్తి శీను నాలుగున్నరేళ్ళుగా జైల్లో ఉండవలసి వస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.