షర్మిల దుష్టశక్తుల ట్రాప్ లో పడిపోయారు.. చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్నారు: మిథున్ రెడ్డి
- చంద్రబాబు స్క్రిప్ట్ ను షర్మిల చదువుతున్నారన్న మిథున్ రెడ్డి
- వైఎస్సార్ పేరును ఛార్జ్ షీట్ లో పెట్టిన పార్టీ కోసం పని చేస్తున్నారని విమర్శ
- జగన్ చెల్లెలిగా ఆమెను గౌరవిస్తామని వ్యాఖ్య
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఉద్దేశించి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విమర్శలు గుప్పించారు. షర్మిల దుష్టశక్తుల ట్రాప్ లో పడ్డారని అన్నారు. ఆమెను చూస్తుంటే జాలి కలుగుతోందని చెప్పారు. ఆమె చంద్రబాబు మాదిరి మాట్లాడుతున్నారని... చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్నారని అన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ ను షర్మిల చదవడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
జగన్ ను 16 నెలలు జైల్లో పెట్టి, వైఎస్సార్ పేరును ఛార్జ్ షీటులో పొందుపరిచిన కాంగ్రెస్ కోసం షర్మిల పని చేయడం బాధాకరమని అన్నారు. అయితే సీఎం జగన్ చెల్లెలిగా షర్మిలను గౌరవిస్తానని చెప్పారు. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు. ఏలూరులోని వైసీపీ కార్యాలయంలో పశ్చిమగోదావరి జిల్లా నేతలతో మిథున్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఆళ్ల నాని కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో మిథున్ రెడ్డి మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.