వైసీపీకి రాజీనామా చేయడం నాకు పెద్ద విషయం కాదు: బాలినేని శ్రీనివాసరెడ్డి

  • హైకమాండ్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన బాలినేని
  • తనకు తెలియకుండానే జిల్లాల్లో పలువురికి టికెట్లు ఇచ్చారని మండిపాటు
  • పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేనప్పుడు ఎందుకు పోటీ చేయాలని ప్రశ్న
వైసీపీ హైకమాండ్ పై కొంత కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈరోజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి రాజీనామా చేయడం తనకు ఎంతో సేపు పట్టదని ఆయన అన్నారు. తనకు తెలియకుండానే జిల్లాలో పలువురికి టికెట్లను కేటాయించారని ఆయన విమర్శించారు. ఒంగోలులో పేదలకు ఇళ్ల పట్టాలను ఇవ్వలేకపోతే రాజకీయాల నుంచి వైదొలగాలని కూడా తాను నిర్ణయించుకున్నానని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న ప్రతిసారి పేదవాళ్లకు ఇళ్ల పట్టాలను ఇప్పించానని... ఈసారి ఇళ్ల స్థలాలను ఇవ్వలేనప్పుడు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలనేది తన ఉద్దేశమని చెప్పారు. 

తాను చెప్పిన వాళ్లకి టికెట్లు ఇవ్వలేదని... అలాంటప్పుడు పార్టీకి రాజీనామా చేయడానికి తనకు ఎంత సమయం పడుతుందని బాలినేని ప్రశ్నించారు. ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డికి అవకాశం రావాలని భగవంతుడిని కోరుకుంటున్నానని చెప్పారు. మాగుంట విషయంలో ఇంతవరకు ఎలాంటి హామీ రాలేదని తెలిపారు.


More Telugu News