​సింగరేణి ఉద్యోగులకు శుభవార్త... రూ.1 కోటి ప్రమాద బీమా ఇచ్చేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంగీకారం

  • ఇప్పటివరకు సింగరేణి ఉద్యోగులకు రూ.40 లక్షల ప్రమాద బీమా
  • బ్యాంకు వర్గాలతో చర్చించిన సింగరేణి యాజమాన్యం
  • బీమా పెంచేందుకు సానుకూలంగా స్పందించిన బ్యాంకు
  • ఫిబ్రవరి 1 నుంచి రూ.1 కోటి బీమా వర్తింపు 
సింగరేణి ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా కలిగిన సింగరేణి ఉద్యోగులకు ఇకపై రూ.1 కోటి వరకు ప్రమాద బీమా లభించనుంది. ఆ మేరకు బ్యాంకు అంగీకరించింది. ఈ కొత్త బీమా పథకాన్ని ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు.  సింగరేణి సీఎండీ బలరాం ఆదేశాలతో సంస్థ అధికారులు బ్యాంకు వర్గాలతో చర్చించారు. ఇప్పటివరకు సింగరేణి ఉద్యోగులకు ప్రమాద బీమా రూ.40 లక్షలుగా ఉంది. తాజా చర్చల అనంతరం ఇప్పుడది కోటి రూపాయలకు పెరిగింది.


More Telugu News