అతిగా మద్యం తాగి ఆసుపత్రి పాలైన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్
- అడిలైడ్ లో ఓ సంగీత కచేరీకి హాజరైన గ్లెన్ మ్యాక్స్ వెల్
- ఫుల్లుగా మందుకొట్టి అపస్మారక స్థితిలో పడిపోయిన క్రికెటర్
- ఆసుపత్రికి తరలించిన స్నేహితులు
- ఎవరు తీసుకునే నిర్ణయాలకు వాళ్లే బాధ్యులన్న ప్యాట్ కమిన్స్
ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల క్రికెట్లో గ్లెన్ మ్యాక్స్ వెల్ ఎంతటి ప్రమాదకర ఆటగాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలి వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్థాన్ పై సంచలన ఇన్నింగ్స్ తో ఆస్ట్రేలియాను గట్టెక్కించి, ఒకరకంగా ఆస్ట్రేలియా కప్ విజేతగా నిలవడానికి కారకుడయ్యాడు. అలాంటి మ్యాక్స్ వెల్ తాజాగా ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నాడో చూడండి!
అడిలైడ్ లో ఓ మ్యూజికల్ నైట్ కు హాజరైన ఈ స్టార్ క్రికెటర్ ఫుల్లుగా మందు కొట్టి ఆసుపత్రి పాలయ్యాడు. 'సిక్స్ అండ్ ఔట్' అనే మ్యూజిక్ బ్యాండ్ అడిలైడ్ నగరంలో సంగీత కచేరీ నిర్వహించగా, ఆస్ట్రేలియా క్రికెటర్లలో కొందరు హాజరయ్యారు. మిగతా క్రికెటర్లు వెళ్లిపోయినా, అక్కడే ఉన్న మ్యాక్స్ వెల్ అభిమానుల మధ్య ఉత్సాహంగా గడిపాడు. ఆ తర్వాత ఫ్రెండ్స్ తో కలిసి అతిగా మద్యం తాగాడు.
ఓ దశలో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడని భావించిన స్నేహితులు అంబులెన్స్ ను పిలిపించి మ్యాక్స్ వెల్ ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం మ్యాక్స్ వెల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు.
ఈ ఘటనపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. అడిలైడ్ లో జరిగిన మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి తాను కూడా హాజరయ్యానని, కానీ అక్కడ్నించి ముందుగానే వచ్చేశానని వెల్లడించాడు. ఎవరు తీసుకునే నిర్ణయాలకు వాళ్లే బాధ్యులని, దీనికి మ్యాక్స్ వెల్ సమాధానం చెప్పాలని స్పష్టం చేశాడు. ఇది క్రికెట్ కు సంబంధించిన అంశం కాదని పేర్కొన్నాడు.
కాగా, మ్యాక్స్ వెల్ ఉదంతంపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (క్రికెట్ ఆస్ట్రేలియా) విచారణ చేపట్టింది.