బీహార్ మాజీ సీఎం, దివంగత కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న
- శతజయంతి సందర్భంగా భారత అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించిన కేంద్రం
- 1924 జనవరి 24న జన్మించిన కర్పూరీ ఠాకూర్
- రెండుసార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పని చేసిన ఠాకూర్
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కర్పూరీ ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఆయన శతజయంతి సందర్భంగా మరణానంతరం అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించారు. 1924 జనవరి 24న ఆయన జన్మించారు. రేపు ఆయన శతజయంతి నేపథ్యంలో బీహార్ ప్రజలకు శుభవార్త అందించింది. కర్పూరీ ఠాకూర్ 1988 ఫిబ్రవరి 17న కన్నుమూశారు. ఆయన రెండుసార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పని చేశారు. 1970 నుంచి 1971 వరకు మొదటిసారి, 1977 నుంచి 1979 వరకు రెండోసారి సీఎంగా పని చేశారు. బీహారీలు ఆయనను గౌరవంగా 'జన్ నాయక్'గా పిలుచుకుంటారు.
ఉత్తర భారతంలోని వెనుకబడిన తరగతుల కోసం పోరాడుతూ సామాజిక న్యాయానికి పర్యాయపదంగా కర్పూరీ ఠాకూర్ నిలిచారు. బీహార్ రాజకీయాల్లో ప్రభావవంతమైన వ్యక్తిగా మిగిలిపోయాడు. గోకుల్ ఠాకూర్, రామ్దులారి దేవి దంపతులకు ఆయన జన్మించారు. పితౌంఝియా అనే చిన్న గ్రామంలో జన్మించిన నాయీ సామాజిక వర్గానికి చెందిన కర్పూరీ ఠాకూర్ ముఖ్యమంత్రిస్థాయికి ఎదిగారు.