సీఎం నేడు ఉరవకొండలో కొత్త అబద్ధాలు చెప్పారు: నక్కా ఆనంద్ బాబు

  • సీఎం జగన్ పై ధ్వజమెత్తిన నక్కా ఆనంద్ బాబు
  • వచ్చే ఎన్నికల్లో మహిళలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యలు
  • ఇవే చివరి ఎన్నికలని ముఖ్యమంత్రి నోరు జారాడని ఎద్దేవా
  • ముఖ్యమంత్రి బాధితులంతా స్టార్ క్యాంపెయినర్లేనని వ్యంగ్యం
"షిక్కటి చిరునవ్వుతో, షక్కటి అబద్ధాలతో అక్కషెల్లెమ్మల్ని 5 ఏళ్లుగా మోసగిస్తూనే ఉన్నావుగా జగన్ రెడ్డీ... వచ్చే ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పడానికి మహిళలు సిద్ధమయ్యారు" అంటూ సీఎం జగన్ పై టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి అక్కచెల్లెమ్మలను మోసగించడానికి సరికొత్తగా నేడు ఉరవకొండలో కొత్త అబద్ధాలు చెప్పాడని, చిక్కటి చిరునవ్వుతో నాలుగున్నరేళ్ల నుంచీ రాష్ట్రంలోని కోటిమందికి పైగా డ్వాక్రా మహిళల్ని వంచిస్తూనే ఉన్నాడని, త్వరలో జరగబోయే ఎన్నికలు తనకు, తన ప్రభుత్వానికి చివరి ఎన్నికలని ముఖ్యమంత్రే నోరుజారాడని నక్కా ఆనంద్ బాబు ఎద్దేవా చేశారు. 

మహిళలకు ఇది చేశాను అని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నాడు!

డ్వాక్రా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించి, వారిని పాలనలో భాగస్వాముల్నిచేసింది టీడీపీనే జగన్ రెడ్డీ. మహిళలకు ఆస్తిలో సమానహక్కు, రాజకీయాల్లో 9 శాతం రిజర్వేషన్లు కల్పించింది తెలుగుదేశమే. ఐదేళ్లలో చంద్రబాబు డ్వాక్రా మహిళలకు రూ.24,669 కోట్లు అందించారు. మహిళలకు ఇది చేశానని చెప్పుకోలేని దుస్థితిలో ఉండే జగన్ రెడ్డి ప్రతిపక్షాల్ని, ప్రసారమాధ్యమాల్ని దూషిస్తున్నాడు.

జగన్ రెడ్డి బాధితులంతా ఆయన స్టార్ క్యాంపెయినర్లే!

డ్వాక్రా మహిళలు, అంగన్ వాడీ సిబ్బంది, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇలా అందరూ క్యాంపెయినర్లే! అవమానాలు, దాడులు, శిరోముండనాలు కానుకగా పొందిన దళితులు, కుటుంబాలను పోగొట్టుకున్న మైనారిటీలు జగన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్లే. ఇప్పటివరకు జగన్ రెడ్డి మార్చిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రధాన స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరించబోతున్నారు" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 

ఓటమిభయంతో సిట్టింగ్ అభ్యర్థుల్ని మారుస్తూ నాటకాలు ఆడుతున్నాడు

జగన్ రెడ్డి మాట్లాడితే సింగిల్ గా పోటీ చేస్తాను అంటాడు. అంత దమ్ము, ధైర్యం ఉంటే తన పార్టీలో గెలిచిన అభ్యర్థుల్ని ఎందుకు మారుస్తున్నాడు? ఓటమి భయంతో మార్పులు చేస్తూ... బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల్ని పక్కనపెడుతూ నాటకాలు ఆడుతున్నాడు. ప్రజలు తరిమి కొడతారని అర్థమయ్యే జగన్ రెడ్డి ఇప్పటికీ నిస్సిగ్గుగా టీడీపీ, జనసేనపైనా,  ప్రసార మాధ్యమాలపైనా, గిట్టనివారిపైనా విషం కక్కుతున్నాడు. 

టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీయే!

జగన్ రెడ్డి నియంత్రత్వ పోకడలు, అప్రజాస్వామిక విధానాలు తట్టుకోలేకనే వైసీపీకి  ఆ పార్టీ నేతలు గుడ్ బై చెబుతున్నారు. మేం గేట్లు బార్లా తెరిస్తే వైసీపీ ఖాళీ కావడం తథ్యం. జగన్ రెడ్డి ఓటమి ఒప్పుకున్నాడు కాబట్టే, ఇప్పటికే 68 మంది సిట్టింగ్ లను మార్చాడు. శ్రీ కృష్ణ దేవరాయలు ఒక్కడే కాదు.. మచిలీపట్నం  ఎంపీ,  మరో ఎంపీ సంజీవ్ కుమార్ ఇప్పటికే బయటకు వచ్చారు” అని ఆనంద్ బాబు చెప్పారు.


More Telugu News