'జై హనుమాన్'లో హనుమంతుడు ఎవరనేది త్వరలో చెబుతాం: ప్రశాంత్ వర్మ

  • ఈ నెల 12న విడుదలైన 'హను మాన్' 
  • ఇంతవరకూ 200 కోట్లకి పైగా వసూళ్లు
  • సీక్వెల్ గా రూపొందనున్న 'జై హనుమాన్'
సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లకు వచ్చిన సినిమాలలో 'జై హనుమాన్' ఒకటి. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆల్రెడీ ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. తాజా ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ .. "ఈ కంటెంట్ పై మాకు నమ్మకం ఉంది. కానీ కమర్షియల్ గా ఈ స్థాయి సక్సెస్ అవుతుందని ఊహించలేదు" అన్నాడు.  

కథ ... స్క్రీన్ ప్లే ... వీ ఎఫ్ ఎక్స్ అన్నీ సమపాళ్లలో కుదరడమే ఈ సినిమా ఇంతటి హిట్ కావడానికి కారణమని భావిస్తున్నాము. హనుమంతుడిని ఇష్టపడని వాళ్లంటూ దాదాపుగా ఉండరు. ముఖ్యంగా పిల్లలంతా హనుమంతుడిని ఎక్కువగా లైక్ చేస్తారు. వాళ్లంతా ఈ సినిమా పట్ల ఆసక్తిని చూపించడం వలన ఈ స్థాయి వసూళ్లు సాధ్యమయ్యాయి" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 

" ఈ సినిమాకి సీక్వెల్ గా 'జై హనుమాన్' ను ప్లాన్ చేశాము. సీక్వెల్ లో హనుమంతుడి పాత్ర ప్రేక్షకుల ముందుకు వస్తుంది. హనుమంతుడిగా ఎవరు చేయనున్నారనేది మరికొన్ని రోజుల్లో ఎనౌన్స్ చేస్తాము. సాంకేతిక పరిజ్ఞానం పరంగా ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తుందని నేను నమ్మకంగా చెప్పగలను" అని అన్నాడు. 



More Telugu News