'దేవర' షూటింగ్ లో సైఫ్ అలీ ఖాన్ కు గాయాలు.. ముంబైలో శస్త్రచికిత్స

  • సైఫ్ మోకాలు, భుజానికి గాయాలు
  • ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స
  • సైఫ్ పక్కన ఉన్న ఆయన భార్య కరీనా కపూర్
జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'దేవర' చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షూటింగ్ కారణంగా జూనియర్ ఎన్టీఆర్ నిన్న అయోధ్య వేడుకకు కూడా వెళ్లలేకపోయారు. అయితే, షూటింగ్ లో సైఫ్ అలీ ఖాన్ గాయపడ్డారు. ఆయన మోకాలు, భుజానికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ట్రైసెప్స్ కు డాక్టర్లు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో సైఫ్ పక్కన ఆయన భార్య, సినీ నటి కరీనా కపూర్ ఉన్నారు. 

గాయం కారణంగా సైఫ్ కొన్ని రోజుల పాటు 'దేవర' షూటింగ్ కు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. షెడ్యూల్ ప్రకారం తొలి పార్ట్ ఏప్రిల్ 5న విడుదల కావాల్సి ఉంది. మరోవైపు గాయంపై సైఫ్ స్పందిస్తూ... మన వృత్తిలో భాగమే ఈ గాయాలు, ఆపరేషన్ అని చెప్పారు. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో తాను సురక్షితంగా ఉన్నానని తెలిపారు.


More Telugu News