నెట్ ఫ్లిక్స్ వేదికపైకి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా 'భక్షక్'
- వాస్తవ సంఘటనల ఆధారంగా 'భక్షక్'
- ప్రధానమైన పాత్రను పోషించిన భూమి పెడ్నేకర్
- నిర్మాణ సంస్థగా షారుక్ బ్యానర్
- దర్శకత్వం వహించిన పులకిత్
- ఫిబ్రవరి 9 నుంచి జరగనున్న స్ట్రీమింగ్
ఈ మధ్య కాలంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్ కి విపరీతమైన ఆదరణ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో మరిన్ని ఓటీటీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. అలాంటి సినిమాల జాబితాలో తాజాగా 'భక్షక్' చేరిపోయింది. భూమి పెడ్నేకర్ ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా ఇది.
హీరో షారుక్ ఖాన్ సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమైంది. నిర్మాణ వ్యవహారాలను గౌరీఖాన్ చూసుకున్న ఈ సినిమాకి, పులకిత్ దర్శకత్వం వహించాడు. భూమి పెడ్నేకర్ తో పాటు సంజయ్ మిశ్రా .. ఆదిత్య శ్రీవత్సవ నటించారు. రీసెంటుగా రిలీజ్ చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ అందరిలోను ఆసక్తిని పెంచింది.
'నెట్ ఫ్లిక్స్' లో ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో భూమి పెడ్నేకర్ నిజాయతీగా వ్యవహరించే జర్నలిస్ట్ వైశాలి పాత్రలో కనిపించనుంది. బాలికలపై .. మహిళలపై జరుగుతున్న నేరాలను ప్రశ్నించడానికి వైశాలి ముందుకు వస్తుంది. ఫలితంగా ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందనేది కథ. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా ఇది.