రామ జన్మభూమి ప్రాంగణంలో జటాయువు విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

  • సీతను కాపాడేందుకు రావణుడితో పోరాడిన దివ్య పక్షి జటాయువు
  • పోరాటంలో నేలకొరిగిన వైనం
  • రామ జన్మభూమి ప్రాంగణంలో జటాయువు విగ్రహం ఏర్పాటు 
రామాయణంలో విశిష్ట ప్రాశస్త్యం ఉన్న దివ్య పక్షి జటాయువు. సీతను కాపాడేందుకు రావణుడితో పోరాడి నేలకొరిగిన ఈ మహా విహంగానికి అయోధ్యలోని రామ జన్మభూమిలో తాజాగా విగ్రహం ఏర్పాటు చేశారు. ఇవాళ బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ రామ జన్మభూమి ప్రాంగణంలోని కుబేర్ తిలా ప్రదేశాన్ని సందర్శించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన జటాయువు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అంతేకాదు, ఇక్కడి శివలింగానికి జలాభిషేకం చేశారు. శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అంతకుముందు, తన ప్రసంగంలో ప్రధాని మోదీ రామాయణంలోని విశిష్ట వ్యక్తులను ప్రస్తావించారు. భక్త శబరి, నిషాదుల రాజు గుహుడు తదితరులతో పాటు ఉడుత, జటాయువు వంటి దివ్య ప్రాణులను కూడా స్మరించుకున్నారు.


More Telugu News