అయోధ్యలో బాలరాముడిని చూశా.. అద్భుతంగా ఉంది: నటుడు సుమన్
- బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అద్భుతంగా జరిగిందని వెల్లడి
- తనతో పాటు చూసిన వారందరికీ రాములవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్న సుమన్
- ప్రతి భారతీయుడు ఒక్కసారి అయినా చూడాల్సిన దేవాలయమన్న సుమన్
అయోధ్య రామమందిరంలోనికి వెళ్లి బాలరాముడిని చూశానని... చాలా అద్భుతంగా ఉందని సినీ నటుడు సుమన్ అన్నారు. ఆర్కిటెక్చర్ కూడా అద్భుతంగా ఉందని కొనియాడారు. తన మనసుకు చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో సుమన్ కూడా పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ... ఒక నటుడిగా.. ఒక వీఐపీగా కాకుండా భక్తుడిగా బాలరాముడి వద్దకు వచ్చానని.. అయితే తాను ఆర్టిస్ట్‌ను కాబట్టి తనకు ఓ బ్లాక్‌లో కేటాయించారని తెలిపారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అద్భుతంగా జరిగిందన్నారు.
తనతో పాటు చూసిన వారందరికీ రాములవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నానన్నారు. రాములవారి వద్దకు వెళ్లినప్పుడు తనకు చాలా బాగా అనిపించిందన్నారు. బయట చూస్తే ఏదో సెట్టింగ్‌లా అనిపించినప్పటికీ దగ్గరకు వెళ్లేకొద్దీ మహాద్భుతంగా ఉందన్నారు. శిల్పకళ కూడా అద్భుతమని కొనియాడారు. ప్రతి భారతీయుడు ఒక్కసారి అయినా వచ్చి చూడాల్సిన దేవాలయం అయోధ్య రామమందిరం అన్నారు. బాలరాముడి దర్శనం తనకు మరింత ఉత్తేజాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.