అయోధ్య వీడియోకు బదులు దుర్గా మాత వీడియో పంచుకున్న హర్భజన్... ఆడుకుంటున్న నెటిజన్లు!
- నేడు అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ
- పొరబాటున మరో వీడియో పోస్టు చేసిన హర్భజన్
- నెటిజన్లు ఏకిపడేస్తున్నా వీడియో డిలీట్ చేయని మాజీ క్రికెటర్
ఇవాళ యావత్ భారతదేశం అయోధ్య రాముడి తలంపుతో వేడుకలు చేసుకుంటోంది. మీడియా, సోషల్ మీడియా, ఊరూ వాడా... ఎక్కడ చూసినా బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ గురించే చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో, టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ దురదృష్టం కొద్దీ నెటిజన్ల బారినపడ్డాడు.
అసలేం జరిగిందంటే... అందరిలాగే అయోధ్య గురించి తాను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేయాలని హర్భజన్ ఉబలాటపడ్డాడు. కానీ, అయోధ్య రామయ్య వీడియోకు బదులుగా కోల్ కతా దుర్గామాత వీడియో పోస్టు చేశాడు. ఇంకేముందీ... నెటిజన్లు ఆడుకోవడం మొదలుపెట్టారు.
మిస్టర్ టర్బనేటర్... నువ్వు పోస్టు చేసిన వీడియో కోల్ కతా నేపథ్యంలోనిది... నువ్వు గనుక టీమిండియా కెప్టెన్ వి అయ్యుంటే ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను మన ఆటగాళ్లు అనుకునేవాడివేమో! దేవుని దయ వల్ల నువ్వు కెప్టెన్ వి కాలేదు అంటూ ఓ నెటిజన్ చురక అంటించాడు.
ఇది ఫేక్ పోస్ట్ అంటూ మరో మహిళా నెటిజన్ పేర్కొంది. నువ్వు వీడియో విషయంలో పొరబడ్డావని చెబుతున్నప్పటికీ వీడియోను డిలీట్ చేయడం లేదంటే, నువ్వు కూడా ఈసారి బీజేపీతో కలిసేట్టున్నావు అని వ్యాఖ్యానించింది.