రామమందిర నిర్మాణ కార్మికులను సన్మానించిన ప్రధాని మోదీ... ఇదిగో వీడియో
- బుట్టలో పూలు పట్టుకొని కార్మికులపై చల్లిన ప్రధాని మోదీ
- వందల సంఖ్యలో ఉన్న కార్మికులను కుర్చీలలో కూర్చోబెట్టి అంతా తిరుగుతూ పూలు చల్లిన ప్రధాని
- మధ్యాహ్నం జటాయువు విగ్రహాన్ని ఆవిష్కరించిన నరేంద్రమోదీ
అయోధ్యలో రామమందిర నిర్మాణ కార్మికులను ప్రధాని నరేంద్రమోదీ సన్మానించారు. కార్మికులపై పూలు చల్లి నమస్కారాలు చేశారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ అనంతరం నరేంద్రమోదీ కార్మికులకు సన్మానం చేశారు. వందల సంఖ్యలో ఉన్న కార్మికులను కుర్చీలలో కూర్చోబెట్టి ఓ బుట్టలో పూలు పట్టుకున్న మోదీ వారిపై చల్లుకుంటూ వెళ్లి గౌరవించారు. ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని కోట్లాదిమంది టీవీలలో.. ఆయా ప్రాంతాలలోని దేవాలయాలు, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్క్రీన్‌ల ద్వారా చూశారు. ప్రాణప్రతిష్ఠ జరిగిన సమయంలో కొత్తగా నిర్మితమైన అయోధ్య రామమందిరంపై ఆర్మీ హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి.
బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ తర్వాత మధ్యాహ్నం ప్రధాని నరేంద్రమోదీ అయోధ్య రామాలయ ప్రాంగణంలో జటాయువు విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాగా అయోధ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ మహత్కర ఘట్టంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.