ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో కరోనా కలకలం
- ఇటీవల ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు
- మ్యాచ్ తర్వాత ఆటగాళ్లకు కరోనా పరీక్షలు
- స్టార్ బ్యాట్స్ మన్ ట్రావిస్ హెడ్ కు కరోనా పాజిటివ్
యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి ఇంకా ఉనికిని చాటుకుంటూనే ఉంది. తాజాగా, ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేగింది. స్టార్ బ్యాట్స్ మన్ ట్రావిస్ హెడ్ కు కరోనా నిర్ధారణ అయింది.
ఆసీస్ జట్టు కొన్ని రోజుల కిందట వెస్టిండీస్ తో తొలి టెస్టు ఆడింది. ఈ మ్యాచ్ తర్వాత ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించగా... ట్రావిస్ హెడ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో, ట్రావిస్ హెడ్ ను మిగతా ఆటగాళ్లకు దూరంగా ఉంచారు. అతడు రేపటి వరకు ఐసోలేషన్ లో ఉంటాడు. జనవరి 25 నుంచి జరిగే రెండో టెస్టులో హెడ్ ఆడడం కష్టమేననిపిస్తోంది. హెడ్ వెస్టిండీస్ తో తొలి టెస్టులో సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ట్రావిస్ హెడ్ గతంలోనూ ఓసారి కరోనా బారినపడ్డాడు. 2021లో తొలిసారి కరోనా సోకడంతో అప్పుడు యాషెస్ టెస్టు మ్యాచ్ కు దూరమయ్యాడు.